![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 2.0 లో గ్రాంఢ్ ఎంట్రీ ఇచ్చాడు అంబటి అర్జున్. బిగ్ బాస్ ముందు వరకు 'దేవత' సీరియల్ లో హీరోగా ఒక్క ఆ సీరియల్ అభిమానులకే పరిచయ అయిన అర్జున్ బిగ్ బాస్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడయ్యాడు.
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరు దుమ్ము, ఎవరు దమ్మో చెప్పమని నాగార్జున అడిగినప్పుడు.. శివాజీ దమ్ము, అమర్ దీప్ దుమ్ము అని చెప్పాడు. హౌస్ లోకి వెళ్ళగానే మొదటి నామినేషన్ లో తన ఫ్రెండ్ అమర్ దీప్ నామినేషన్ చేసి హౌస్ లోని వారందరికి షాకిచ్చాడు. ఆ తర్వాత తోటి హౌస్ మేట్స్ తో అంతంత మాత్రం కలిసి ఉంటూ ఎవరితో పెద్దగా బాండింగ్ పెంచుకోలేదు అర్జున్. హౌస్ లో వారమంతా ఎవరెలా ఉన్నారు.. రూల్స్ ఫాలో అయ్యారా లేదా.. టాస్క్ లలో ఎవరైన ఫౌల్స్ చేశారా.. అన్నీ జాగ్రత్తగా పరిశీలించి నామినేషన్ లో.. ఆ ఫౌల్ చేసిన వారిని నామినేట్ చేసి మీరు ఆ టాస్క్ లో ఆ ఫౌల్ చేశారంటు చెప్తాడు. దాంతో ఎవరైన సరే అతనితో మాట్లాడటానికి కాస్త ఇబ్బందిపడేవారు. ఇక పల్లవి ప్రశాంత్ పై అరవడం అతనికి కాస్త మైనస్ అయింది. అర్జున్ వాళ్ళ భార్య పప్పీ ఫ్యామిలీ వీక్ లో వచ్చినప్పుడు మోస్ట్ ఎమోషనల్ అయ్యాడు. ఇక వాళ్ళ భార్య శివాజీకి ఓ మాట చెప్పిందంట.. అర్జున్ ని కెప్టెన్ గా చూడాలని ఉంది అని శివాజీకి పప్పీ చెప్పిందంట. అదే విషయాన్ని శివాజీ కెప్టెన్సీ టాస్క్ లో చెప్పాడు. అర్జున్ కోసం స్టాండ్ తీసుకున్న శివాజీ.. అమర్ దీప్ కి విలన్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వారం నామినేషన్ లో ఇదే పాయింట్ మీద శివాజీని నామినేట్ చేశాడు అర్జున్. దాంతో అప్పటిదాకా మంచి అభిప్రాయం ఉన్న శివాజీకి ఒక్కసారిగా అతను గేమ్ ఆడుతున్నాడని అర్థం చేస్కొని అర్జున్ తో దూరంగా ఉన్నాడు.
ఇక టికెట్ టూ ఫినాలే లో పన్నెండు టాస్క్ లు పెడితే దాదాపు అన్నింట్లో విజయం సాధించాడు. అయితే అతను ఎవరి సపోర్ట్ తీసుకోకపోవడం కొన్ని టాస్క్ లలో మైనస్ అయింది. తాజాగా అంబటి అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో కొన్ని ఫోటోలని షేర్ చేశాడు. బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే రోజు వాళ్ళ భార్య పప్పీని స్టేజ్ మీదకి నాగార్జున రమ్మని చెప్పడం.. అతనితో కలిసి ఫోటోలు దిగడం తనకెంతో ఆనందంగా ఉందని అర్జున్ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చాడు. " వెడ్డింగ్ డైరీస్ " అనే ఓ లఘుచిత్రాన్ని చేస్తున్నట్టు.. అందులోని ' పెళ్ళైతే ఇంతేనా' అనే లిరికల్ వీడియో రీలీజ్ అయినట్టు మరో పోస్ట్ ని షేర్ చేశాడు అర్జున్. అయితే తన భార్యతో పెద్దగా ఫోటోలేం లేవని చాలాసార్లు బాధపడ్డ అర్జున్.. నాగార్జున గారు స్వయంగా స్టేజ్ మీదకి తనకు ఓ మర్చిపోలేని జ్ఞాపకమంటు చెప్పుకొచ్చాడు. కాగా భార్య డెలివరీ ముందు ఎమోషనల్ పోస్ట్ చేశాడంటూ నెట్టింట ఈ వార్త వైరల్ గా మారింది.
![]() |
![]() |